ఖబర్దార్ పవన్‌: రాజాసింగ్‌ స్ట్రాంగ్‌​ వార్నింగ్‌

ఖబర్దార్ పవన్‌: రాజాసింగ్‌ స్ట్రాంగ్‌​ వార్నింగ్‌



సాక్షి, హైదరాబాద్‌: హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఖండించారు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అని ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదని హితవుపలికారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబర్దార్ పవన్‌ అని హెచ్చరించారు.