మహారాష్ట్ర, హరియాణా లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 45 శాతం పోలింగ్ నమోదు కాగా, హరియాణాలో 55శాతం నమోదైంది. సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగియనున్నది
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యంత మెజార్టీతో గెలవబోతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 222 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు. ' 220 స్థానాలు కాదు 222 స్థానాల్లో బీజేపీ జెండా ఎగరేయబోతుంది. గతంలో ఒక్కసారి కాంగ్రెస్ 222 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రికార్డును ఈసారి బ్రేక్ చేయబోతున్నాం. మహారాష్ట్రలో బలమైన ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నాం' అని ప్రకాశ్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు.